అభిషేక్ ఇన్‌స్టా పోస్ట్.. నెటిజ‌న్ల ఉచిత స‌ల‌హాలు

అభిషేక్ ఇన్‌స్టా పోస్ట్.. నెటిజ‌న్ల ఉచిత స‌ల‌హాలు

Summarize with AI

బాలీవుడ్ నటుడు (Bollywood Actor) అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) నటించిన కొత్త సినిమా ‘హౌస్‌ఫుల్ 5’ (‘Housefull 5’) ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన పొందుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. “ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశా” అంటూ అందులో పేర్కొనడంతో, కుటుంబ సమస్యల వల్లనే ఆయన ఇలాంటి పోస్ట్ చేశారా అని నెటిజన్లు సందేహిస్తున్నారు. కొంతకాలంగా ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌ల (Aishwarya Rai – Abhishek Bachchan’s) విడాకుల (Divorce) వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో, ఆయన చేసిన ఈ పోస్ట్ వాటికి మరింత బలాన్ని చేకూర్చేలా ఉంది.

అభిషేక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
అభిషేక్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, రోజువారీ జీవితంలో ఎదురయ్యే బాధ్యతలపై మాత్రమే దృష్టి పెట్టడం కంటే, ఆంతరంగిక ఆనందం గురించి ఆలోచించడం ఎంత కీలకమో నొక్కి చెప్పారు. “నేను మరోసారి ఒంటరిగా ఉండాలని ఉంది. నా కోసం నేను కొంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది. ఈ జనసమూహం నుంచి దూరంగా ఉంటూ నన్ను నేను వెతుక్కోవాలనుకుంటున్నాను. నా ప్రియమైన వారికోసం అన్నీ ఇచ్చేశాను. ఇప్పుడు నాకూ కొంత సమయం కావాలి. నా గురించి నేను తెలుసుకునేందుకు ఒంటరిగా ఉండాలని ఉంది” అని ఆయన హిందీలో రాసుకొచ్చారు.

నెటిజన్ల కామెంట్లు
అభిషేక్ బచ్చన్ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. “మిస్ ఇండియా (Miss India)ను వివాహం చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా లేడు అంటే ఏమిటి? సంతోషానికి కొలమానం ఉంటుందా?” అంటూ ఒకరు ప్రశ్నించగా, మరొక వ్యక్తి “సార్, మీ భార్య, పిల్లలతో కొంత సమయం గడపండి, మీరు మంచిగా రీసెట్ అవుతారు” అని సలహా ఇచ్చారు.

దాదాపు 17 ఏళ్ల క్రితం అభిషేక్ – ఐశ్వర్యలకు వివాహం జరిగింది. వీరికి ఆరాధ్య (Aaradhya) (15) అనే కుమార్తె ఉంది. ఈ జంట విడాకులు తీసుకోనున్నారంటూ గత కొంతకాలంగా పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. అయినప్పటికీ, ఆ వార్తల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు అభిషేక్ షేర్ చేసిన పోస్ట్‌తో మరోసారి విడాకుల అంశం తెరపైకి వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment