బెంగళూరు తొక్కిసలాటపై గవర్నర్ సంచలన ఆరోపణలు

బెంగళూరు తొక్కిసలాటపై గవర్నర్ సంచలన ఆరోపణలు

Summarize with AI

ఐపీఎల్ చరిత్ర (IPL History)లో 18 ఏళ్ల తర్వాత టైటిల్ (Title) గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును ఘనంగా సత్కరించేందుకు బెంగళూరులో ఏర్పాటు చేసిన వేడుక తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తొక్కిసలాట చెలరేగి, 11 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.

బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress)పై మండిపడుతోంది. అయితే ఇప్పుడు, కర్ణాటక గవర్నర్ (Karnataka Governor) థావర్ చంద్ గెహ్లాట్ (Thawar Chand Gehlot) చేసిన కామెంట్లు మరోసారి వేడెక్కించాయి. ఆర్సీబీ ఆటగాళ్లను సత్కరించేందుకు రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు ఆహ్వానించాలని సిద్ధరామయ్య ప్రభుత్వం (Siddaramaiah Government) స్వయంగా ప్లాన్ చేసిందట! కార్యక్రమం విధాన సౌధలో ఉంటుందని ప్రభుత్వం ముందు వెల్లడించిందని గవర్నర్ వర్గాలు చెబుతున్నాయి.

గవర్నర్‌కు విధాన సౌధ ఈవెంట్‌కి అధికారిక ఆహ్వానం అందిందని రాజ్ భవన్ వర్గాల క్లారిటీ ఇచ్చింది. అయితే, ఇదే సందర్భంలో సీఎం సిద్ధరామయ్య మాత్రం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ఈ వేడుకను క‌ర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) చేపట్టిందని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు, రాజ్ భవన్ స్టేట్‌మెంట్‌కి మధ్య గట్టి విరుద్ధత కనపడుతోంది. అసలు ఈ సత్కారం ఎవరి పేరుమీద జరిగింది? ప్లాన్ చేసింది ఎవరు? బాధ్యత ఎవరిది? అన్నదానిపై రాజకీయ వాదనలు మళ్లీ ఊపందుకున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment