టెన్త్ రిజ‌ల్ట్‌లో పాస్‌.. రీవాల్యూయేష‌న్‌లో ఫెయిల్‌..!

టెన్త్ రిజ‌ల్ట్‌లో పాస్‌.. రీవాల్యూయేష‌న్‌లో ఫెయిల్‌..!

Summarize with AI

ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం (Government Negligence) విద్యార్థుల‌ను (Students) ముప్పు తిప్ప‌లు పెడుతోంది. ప‌దో త‌ర‌గ‌తి (Tenth Class) ప‌రీక్షా ఫ‌లితాల్లో (Examination Results) పాసైన (Passed) విద్యార్థులు రీవాల్యూయేష‌న్‌ (Re-evaluation)లో ఫెయిల్ (Fail) అయిన‌ట్లు ప్ర‌క‌టించ‌డం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనాల్లో ఉపాధ్యాయులు చేస్తున్న తప్పిదాల కారణంగా విద్యార్థులు మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది. వేగంగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ పేపర్లు దిద్దించడం, హడావుడిగా మార్కుల లెక్కింపులు చేస్తుండటంతో అనేక పొరపాట్లు చోటుచేసుకుంటున్నాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన సమయంలో తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి.

60 శాతం మంది రీవాల్యూయేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు
పదో తరగతి పరీక్షల ముల్యాంకనం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని భావించిన 60 మంది విద్యార్థులు ఈ ఏడాది రీవాల్యూయేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. 66,363 మంది రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవ‌డంతో మూల్యంక‌నంలో పాసైన విద్యార్ధులను టెన్త్ బోర్డు ఫెయిల్ చేసింది. మూల్యాంకనంలో తప్పులు దొర్లితే చర్యలు తీసుకునేందుకు నిబంధనలు ఉన్నాయి. వీటిని సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలున్నాయి. వైఎస్సార్‌ కడప (YSR Kadapa) జిల్లా ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన గంగిరెడ్డి మోక్షిత (Gangireddy Mokshita)కు ఇటీవల విడుదల చేసిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సాంఘిక శాస్త్రంలో 21 మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో పేర్కొన్నారు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. 84మార్కులు వచ్చాయి. మొత్తం నాలుగు భాగాలుగా విభజించిన మార్కుల జాబితాలో మూడింటిని వదిలేసి ఒక భాగంలోని వాటిని మాత్రమే లెక్కించడంతో ఈ తప్పిదం చోటుచేసుకుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment