ఇకపై హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులకు గేట్‌క్లోజ్

ఇకపై హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులకు గేట్‌క్లోజ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) విదేశీ విద్యార్థులపై (Foreign Students) కీలక నిషేధం విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హార్వర్డ్ చదివే అంతర్జాతీయ విద్యార్థులు కలవరపడిపోతున్నారు.

అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రస్తుతం చదువుతున్న విదేశీ విద్యార్థుల సర్టిఫికేషన్‌ (Certification)ను రద్దు చేస్తూ హోమ్లాండ్ సెక్యూరిటీ (Department of Homeland Security) నుంచి లేఖ జారీ అయ్యింది. తద్వారా వారిని ఇతర వర్సిటీలకు బదిలీ అయ్యేలా చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా, వారి చట్టబద్ధ హోదా (legal status) రద్దవుతుందని హెచ్చరించారు. దీంతో చాలా మంది విదేశీ విద్యార్థులు అయోమయంలో పడిపోయారు.

కొత్త విద్యా సంవత్సరం నుంచీ నిషేధం
2025–2026 విద్యా సంవత్సరానికి హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా ఏ ఒక్క విదేశీ విద్యార్థిని కూడా చేర్చకూడదని ట్రంప్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అమెరికా విద్యా రంగంపై, అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయంగా మారింది.

తీవ్ర వ్యతిరేకతలు
ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. “హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఇది భారీ షాక్” అని విమర్శకులు పేర్కొంటున్నారు. అమెరికాలోని విద్యా విధానాలను ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నం చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక షాకింగ్ నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన కన్ను విదేశీ విద్యార్థులపై పడటంతో, అమెరికాలో చదువుకునే లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment