జ‌వాన్ కుటుంబానికి వైఎస్ జ‌గ‌న్ భారీ సాయం

ys-jagan-announces-25-lakh-aid-to-martyr-murali-naiks-family

పాకిస్తాన్ (Pakistan) కాల్పుల్లో (Firing) వీర మ‌ర‌ణం పొందిన తెలుగు జవాన్‌ (Telugu Soldier) మురళీ నాయక్‌ (Murali Naik) కుటుంబానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ (Y. S. Jagan) ప‌రామ‌ర్శించారు. బెంగ‌ళూరు నుంచి బ‌య‌ల్దేరి శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌లం క‌ల్లితండా (Kallitanda) లోని ముర‌ళీ నాయ‌క్ నివాసానికి చేరుకొని జ‌వాన్ త‌ల్లిదండ్రులను ప‌రామ‌ర్శించారు. ముర‌ళీ ఫొటోకు జ‌గ‌న్ నివాళుల‌ర్పిస్తున్న స‌మ‌యంలో ముర‌ళీ నాయ‌క్ తండ్రి “నీ దగ్గరకి జగన్ సార్ వచ్చాడ్రా మురళీ లేచి సార్‌కి సెల్యూట్ కొట్టురా ముర‌ళీ అని చేసిన భావోద్వేగ వ్యాఖ్య అంద‌రినీ కంట‌త‌డి పెట్టించింది.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా దేశానికి సేవ‌లు అందించే సైనికులు దుర‌దృష్ట‌వ‌శాత్తు వీర‌మ‌ర‌ణం పొందితే ఆ కుటుంబానికి ఆదుకునేందుకు రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించే సంప్రదాయాన్ని త‌మ ప్రభుత్వమే ప్రారంభించిందని వైఎస్ జ‌గ‌న్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వైసీపీ తరఫున వీర జవాన్ కుటుంబానికి రూ. 25 లక్షల (₹25 lakhs) ఆర్థిక సాయం (Financial Aid) అందిస్తామని ప్ర‌క‌టించారు.

వీర జవాన్‌ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకం అని.. ఆయన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాన‌ని, వీర జ‌వాన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు వైఎస్‌ జగన్‌.

Join WhatsApp

Join Now

Leave a Comment