క‌ళ్లితండాకు వెళ్ల‌నున్న‌ వైఎస్ జ‌గ‌న్‌

క‌ళ్లితండాకు వెళ్ల‌నున్న‌ వైఎస్ జ‌గ‌న్‌

Summarize with AI

భార‌త్‌-పాక్ (India-Pakistan) మ‌ధ్య జ‌రుగుతున్న‌ యుద్ధంలో తెలుగు జవాన్‌ (Telugu soldier) మురళీ నాయక్ (Murali Naik) వీరమరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పెనుకొండ (Penukonda) నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీ నాయక్ శ‌త్రుదేశం పాకిస్తాన్ గురువారం రాత్రి జ‌రిపిన కాల్పుల్లో (Firing) మ‌ర‌ణించారు (Died). పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆయన మరణించినట్లు ఆర్మీ అధికారులు తల్లిదండ్రులకు సమాచారం పంపారు. ఒక్కగానొక్క కొడుకును దేశ సేవ కోసం ఆర్మీకి పంపించిన త‌ల్లిదండ్రులు.. త‌మ కొడుకు చనిపోయాడ‌న్న వార్త అంద‌డంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

స‌రిహ‌ద్దులో జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ వీర మ‌ర‌ణం ప‌ట్ల మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) సంతాపం వ్య‌క్తం చేశారు. శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా వైసీపీ జిల్లా అధ్య‌క్షురాలు ఉష‌శ్రీ చ‌ర‌ణ్ (Usha Sri Charan) జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ నివాసానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముర‌ళీ త‌ల్లిదండ్రుల‌ను ఫోన్‌లో (Over Phone) ప‌రామ‌ర్శించారు (Consoled). ఆ వెంట‌నే మంత్రి స‌బిత సైతం వీర జ‌వాన్ ముర‌ళీ నివాసానికి వెళ్లారు. ఆయ‌న త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం సీఎం చంద్ర‌బాబుతో బాధిత త‌ల్లిదండ్రుల‌ను ఫోన్‌లో మాట్లాడించారు.

క‌ళ్లితండాకు వైఎస్ జ‌గ‌న్‌..
పాకిస్తాన్ సైన్యం దాడిలో వీర మ‌ర‌ణం పొందిన ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ క‌ళ్లితండా (Kallithanda)కు వెళ్ల‌నున్నారు. ఈ నెల 13వ తేదీన వైఎస్ జ‌గ‌న్ పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం క‌ళ్లితండాకు వెళ్ల‌నున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే జ‌వాన్ కుటుంబాన్ని ఫోన్‌లో ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్‌.. 13వ తేదీన నేరుగా వెళ్లి బాధిత కుటుంబానికి ఓదార్చ‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment