ఉగ్రదాడి (Terror Attack) అనంతరం భారత్-పాక్ (India-Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ (Former Pakistan High Commissioner) అబ్దుల్ బాసిత్ (Abdul Basit) చేసిన తాజా ట్వీట్ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10 లేదా 11వ తేదీలో పాకిస్తాన్‌పై భారత్ (India) దాడికి దిగవచ్చని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మే 9న జరగనున్న రష్యా విక్టరీ డే తర్వాత ఈ దాడి జరగవచ్చన్న ఉద్దేశంతో ఈ హెచ్చరిక చేశారని భావిస్తున్నారు. అయితే దీనిపై భారత్ అధికారికంగా స్పందించలేదు. పాక్ మాజీ హైకమిషనర్ బాసిత్ చేసిన ట్వీట్ పాక్‌లో పెనుదుమారాన్ని రేపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యకు సిద్ధమవుతుంది. ప్రధాని మోడీ (Prime Minister Modi) భారత సైన్యానికి (Indian Army) పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కేంద్ర హోం శాఖ కూడా రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. మాక్ డ్రిల్స్‌లో భాగంగా పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు. పహల్గామ్ వంటి ఉగ్రదాడులు జరిగితే వాటిని దీటుగా ఎదుర్కోవడం ఎలాగో పౌరులకు నేర్పిస్తారు.
India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.
— Abdul Basit (@abasitpak1) May 6, 2025








అవసరమైతే తెలంగాణ అంతా తిరుగుతా: పవన్