మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

మోడీ సభ సమీపంలో అగ్నిప్రమాదం.. త‌ప్పిన ప్ర‌మాదం

అమరావతి పున‌ర్నిర్మాణం (Amaravati reconstruction) శుక్ర‌వారం ప్ర‌ధాన‌మంత్రి మోడీ (Prime Minister Modi) చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ ప్ర‌ధాని మోడీ స‌భా ప్రాంగ‌ణానికి చేరుకున్నారు. ప్ర‌ధాని మోడీ స‌భా ప్రాంగ‌ణానికి స‌మీపంలో కేవ‌లం 3 కిలోమీటర్ల దూరంలో భారీ అగ్నిప్రమాదం (Major Fire Accident) చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా (Guntur District) తుళ్ళూరు మండలంలోని మందడం గ్రామంలో ఈ ఘటన జరిగింది.

పంట పొలాల్లో ఉన్న పైపులకు మంటలు అంటుకోవడంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ద‌ట్ట‌మైన పొగ ఆకాశాన్ని క‌మ్మేసింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్ర‌ధాని మోడీ సభ జరుగుతున్న సమయంలో ఇలా సమీపంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment