ఐదేళ్ల‌లో రోబోలతో స‌ర్జ‌రీలు – ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్‌

ఐదేళ్ల‌లో రోబోలతో స‌ర్జ‌రీలు - ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్‌

Summarize with AI

సర్జరీల ప్రపంచంలో రాబోతున్న విప్లవంపై టెక్ దిగ్గ‌జం ఎలాన్ మస్క్ (Elon Musk) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ‘‘ఐదేళ్ల‌లో రోబోలు మానవ సర్జన్లను మించి పనిచేస్తాయి. న్యూరాలింక్ (Neuralink) సంస్థ మేధస్సు-కంప్యూటర్ ఎలక్ట్రోడ్ ఇన్సర్షన్ కోసం ప్రత్యేక రోబోను (Robot) ఉపయోగించింది. ఎందుకంటే ఇది చేయడంలో అవసరమైన వేగం (Speed), ప‌ర్‌ఫెక్ష‌న్‌ (Perfection) మనుషులకు సాధ్యం కాదు’’ అని మస్క్ వెల్లడించారు.

నేటి వరకు రోబోలు సర్జన్లకు సహాయకులు మాత్రమే. డాక్టర్లు రోబోలను ఉపయోగించి శస్త్రచికిత్సలు (Surgeries) నిర్వహిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో రోబోలే స్వయంగా సర్జరీలు చేసే పరిస్థితి వస్తుందని మస్క్ అంచనా వేస్తున్నారు. అయితే, దీనిని కొంతమంది వైద్యులు ఖండిస్తున్నారు. ‘‘రోబోలు సహాయక పాత్ర మాత్రమే పోషించగలవు. మానవ బుద్ధి, అనుభవం అవసరమైన కీలక నిర్ణయాలను రోబోలు తీసుకోలేవు,’’ అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment