నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘HIT-3’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 1న గ్రాండ్‌గా విడుదల (Release) కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక్క పది రోజుల్లో సినిమా థియేటర్లకు వస్తోందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఓ స్పెషల్ వీడియో (Special Video) ను రిలీజ్ (Release) చేశారు.
ఈ వీడియోలో నాని రైల్లో ప్రయాణిస్తున్న సీన్ చూపించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్వాములు “పది రోజుల్లో శంభో శివ!” అని గంభీరంగా నినదించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ సినిమాకు ఉన్న ఇంటెన్స్ మూడ్‌ను బలంగా వ్యక్తం చేస్తోంది.
ఈ థ్రిల్లర్ సినిమాను శైలేష్ కొలను (Sailesh Kolanu) డైరెక్ట్ చేస్తున్నారు. ‘HIT’ యూనివర్స్‌లో ఇది మూడో చాప్టర్ కావడంతో అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. మిస్టరీ, సస్పెన్స్‌తో కూడిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.