విశాఖలో రెచ్చిపోయిన‌ మ‌రో ప్రేమోన్మాది.. తల్లీకూతురిపై దాడి

విశాఖలో రెచ్చిపోయిన‌ మ‌రో ప్రేమోన్మాది.. తల్లీకూతురిపై దాడి

Summarize with AI

ఏపీ (AP) లో ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లో జ‌రుగుతున్న వ‌రుస ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. మధురవాడ ఘటన మరువక ముందే, మరో ప్రేమోన్మాది (Obsessive Lover) చేసిన దాడితో నగరంలో కలకలం రేగింది. ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గాజువాక (Gajuwaka) కు చెందిన ఓ యువకుడు, అక్కయ్యపాలెం (Akkayyapalem) కు చెందిన బాలికతో గత ఏడాది నుంచి ప్రేమాయ‌ణం కొనసాగిస్తున్నాడు. ఇద్దరూ ఇంటర్ (Inter) చదువుతున్నట్టు సమాచారం. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ పరిణామంతో ఆగ్ర‌హానికి గురైన యువకుడు, బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి (Mother), కూతురి (Daughter)పై కత్తి (Knife)తో దాడి (Attack)కి తెగబడ్డాడు.

దాడిలో తల్లీకూతుళ్లు గాయపడ్డారు. వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉండగానే వారి కేకలతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడ్డ వారిని ప్రైవేట్ హాస్పిటల్‌ (Private Hospital)కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment