ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 ప్రారంభమై.. త్వరలో లీగ్ దశ కంప్లీట్ అవ్వనున్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ (Fans) కు తీపికబురు అందింది. ఫ్యాన్ బేస్ పరంగా ఎప్పుడూ ప్రత్యేక స్థానం దక్కించుకునే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈసారి మరో ఘనత అందుకుంది. IPL 2025 సీజన్‌లో జియో-హాట్‌స్టార్ (Jio-Hotstar) ద్వారా ప్రసారం చేసిన మ్యాచుల్లో అత్యధిక వ్యూస్ (Highest Views) వచ్చిన మ్యాచ్‌లు అన్నీ ఆర్సీబీతో సంబంధం ఉన్నవే కావడం విశేషం.
ప్రస్తుతం టాప్ స్థానం (Top Position) దక్కించుకున్నది RCB vs KKR మధ్య జరిగిన ఓపెనింగ్ మ్యాచ్. ఈ హైవోల్టేజ్ గేమ్‌కు 41.2 కోట్లు వ్యూస్ లభించాయి. రెండో స్థానంలో నిలిచిన RCB vs CSK మ్యాచ్‌కి 37.4 కోట్లు, మూడో స్థానంలో ఉన్న RCB vs MI మ్యాచ్‌కి 34.1 కోట్లు వ్యూస్ దక్కాయి.
ఇలా టాప్ 3 హైయెస్ట్ వ్యూస్ సాధించిన మ్యాచ్‌లన్నిటిలోనూ RCB పాల్గొనడం, వారి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ ఊహించినట్లుగానే ఆర్సీబీ మ్యాచులే అన్నీ రికార్డులు తిరగరాస్తున్నాయి.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు