కియా కంపెనీలో చోరీ.. ఏకంగా 900 ఇంజిన్లు మాయం

కియా కంపెనీలో చోరీ.. ఏకంగా 900 ఇంజిన్లు మాయం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని శ్రీ సత్యసాయి జిల్లా యర్రమంచి (Yerramanchi) పంచాయతీ పరిధిలో ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) లో భారీ చోరీ (Major Theft) జ‌రిగింది. దొంగలు ఏకంగా 900 కార్ ఇంజిన్ల (Car Engines) ను ఎత్తుకెళ్లారు (Stolen). ఈ సంఘటన గత నెలలోనే జ‌ర‌గ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కకుండా చూడాలని కియా యాజమాన్యం పోలీసులను కోరినట్లు సమాచారం. అయినప్పటికీ, పోలీసులు (Police) ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామనే స్పష్టత ఇవ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు ఈ చోరీ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. దాంతో మార్చి 19న అధికారికంగా కంప్లైంట్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కియా ప్ర‌తినిధులు అధికారికంగా ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ (Investigation) ప్రారంభించారు. కార్‌ ఇంజిన్ల భారీ మొత్తంలో చోరీకి గుర‌వ్వ‌డంపై కంపెనీ యాజ‌మాన్యం సైతం షాక్‌లో ఉంది. కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి. ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తుంటాయని తెలిసింది. ఆ మార్గంలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేక పరిశ్రమకు చేరిన తర్వాతే అవి దొంగిలించబడాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment