పిఠాపురంలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌.. టీడీపీ-జ‌న‌సేన తోపులాట‌

పిఠాపురంలో మ‌ళ్లీ ఉద్రిక్త‌త‌.. టీడీపీ-జ‌న‌సేన తోపులాట‌

డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం (Pithapuram) లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు (Tense Situation) నెల‌కొన్నాయి. జ‌న‌సేన ఎమ్మెల్సీ నాగ‌బాబు (Nagababu) రాక‌తో జ‌న‌సేన‌-టీడీపీ (Janasena-TDP) కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వివాదం త‌లెత్తింది. ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభోత్స‌వాల నేప‌థ్యంలో నాగ‌బాబు పిఠాపురంలో అడుగుపెట్టారు. కుమారపురంలో నాగ‌బాబు చేప‌ట్టే ప్రారంభోత్స‌వాల‌కు టీడీపీ నేత ఎన్వీఎస్ఎన్‌ వ‌ర్మ‌ (NVSN Varma) కు పిలుపు లేక‌పోవ‌డంతో తెలుగుదేశం పార్టీ (TDP) కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను టీడీపీ కార్య‌క‌ర్త‌లు అడుగడుగునా అడ్డుకుంటూ.. జై వ‌ర్మ అంటూ టీడీపీ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. జై జ‌న‌సేన‌, జై ప‌వ‌న్ అంటూ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పసుపు జెండాలతో ర్యాలీ నిర్వహించిన టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట (Pushing and Shoving) చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగి పెద్ద ఎత్తున గందరగోళం చోటుచేసుకుంది.

నాగ‌బాబు పొత్తు ధ‌ర్మం (Alliance Ethics) పాటించ‌కుండా, పిఠాపురంలో ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు వ‌ర్మ‌ను పిల‌వ‌క‌పోగా, కూట‌మి పార్టీల ఫ్లెక్సీల్లో (Flex banners) వ‌ర్మ ఫొటోను తీసేస్తున్నార‌ని, ప‌వ‌న్ కోసం సీటు త్యాగం (Seat Sacrifice) చేసిన వ‌ర్మ‌కు క‌నీస మర్యాద ఇవ్వ‌డం లేద‌ని తెలుగుదేశం నేత‌లు మండిప‌డుతున్నారు. ఇటీవ‌ల పిఠాపురంలో జ‌రిగిన జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో నాగబాబు టీడీపీ నేత వ‌ర్మ‌పై ప‌రోక్షంగా (Indirectly) కామెంట్స్ చేయ‌డంతో ఇరుపార్టీల మ‌ధ్య వైరం మొద‌లైంద‌ని స్థానికులు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment