క్రికెట్ ఆడుతుండ‌గా గుండెపోటు.. బీటెక్ విద్యార్థి మృతి

క్రికెట్ ఆడుతుండ‌గా గుండెపోటు.. బీటెక్ విద్యార్థి మృతి

Summarize with AI

కాలేజీ గ్రౌండ్‌లో క్రికెట్ (Cricket) ఆడుతుండగా హఠాత్తుగా గుండెపోటు (Heart Attack)తో కుప్పకూలి బీటెక్ విద్యార్థి (B.Tech Student) మృతిచెందిన (Died) ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్‌ (Vinay) అనే యువకుడు, సీఎంఆర్ (CMR) కళాశాలలో బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఫీల్డింగ్ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తన స్నేహితుడు కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు ఈ వార్త విన్న వెంటనే శోకసంద్రంలో మునిగిపోయారు.

నేటితరం జీవనశైలి భయంకరం
శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, కార్టిసాల్ స్థాయి పెరగడం, అనారోగ్యకర ఆహారం వంటి కారణాలు యువతలో హార్ట్‌ అటాక్‌లకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఆరోగ్యంగా కనిపించే యువత కూడా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన, నేటితరం జీవనశైలిపై ఆలోచనకు తావిస్తోందని నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణ, సరైన ఆహారం, సరైన విశ్రాంతి ఇవన్నీ మనం పట్టించుకోకపోతే, విషాదాలు వెంటాడుతూనే ఉంటాయ‌ని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment