నెల్లూరులో అద్భుతం.. నెలల బుడతడికి నోబెల్ వరల్డ్ రికార్డ్!

నెల్లూరులో అద్భుతం.. నెలల బుడతడికి నోబెల్ వరల్డ్ రికార్డ్!

Summarize with AI

బుడిబుడి అడుగులు కూడా వేయని వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఘనతను సాధించిన బుడతడు. నెల్లూరు జిల్లా (Nellore district) బుడ‌త‌డు ప్ర‌పంచ రికార్డు (World Record) నెల‌కొల్పాడు. ఆరు నెలల (Six-Month-Old) బుడ‌త‌డు అబ్బుర‌ప‌రిచే రికార్డుతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మాటలు కూడా రాకముందే దేశాలు, రంగులు, జంతువుల పేర్లు గుర్తుపట్టే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించి, నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో (Nobel Book of World Records) చోటు సంపాదించాడు.

ఈ అబ్బాయి స్వల్పకాలిక మెమొరీ టెస్టుల్లో అత్యంత వేగంగా మరియు స‌రైన‌ సమాధానాలు చెప్పినందుకు గుర్తింపు పొందాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చిన్ననాటి నుంచే నెమలిపింఛాలు (Peacock Feathers), జంతువులు (Animals), జాతీయ ప్రతీకలు (National Symbols) వంటి అంశాలను గుర్తుపెట్టుకుంటూ తను చూపించిన మేధస్సు నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది.

ఈ ఘనతతో నెల్లూరు పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. చిన్నారిపై ప్రత్యేక కథనాలు, డాక్యుమెంటరీలు రూపొందించేందుకు పలువురు మీడియా సంస్థలు ముందుకొస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment