గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం భేటీ.. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ?

గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం భేటీ.. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ?

Summarize with AI

తెలంగాణ (Telangana) రాజ్ భవన్‌ (Raj Bhavan) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) భేటీ అయ్యారు. ఉగాది సందర్భంగా గవర్నర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ మర్యాదపూర్వక భేటీకి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అంశం ప్రధానంగా నిలిచిందని సమాచారం. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, కొత్త మంత్రుల ఎంపికపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment