స్టాలిన్, మోదీపై విరుచుకుప‌డ్డ విజ‌య్‌

స్టాలిన్, మోదీపై విరుచుకుప‌డ్డ విజ‌య్‌

తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ వేడి పెరుగుతోంది. నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ తాజాగా 17 కీలక తీర్మానాలను ఆమోదించింది. తిరువన్మయూర్‌లో జరిగిన తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు విద్యా విధానం, నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానాలు చేశారు.

ఈ సందర్భంగా విజయ్ తమిళనాడు సీఎం స్టాలిన్ (Stalin), ప్రధాని మోదీ (Modi) పై విమర్శలు చేశారు. పేరు గొప్పదిగా ఉంటే సరిపోదు.. పాలన గొప్పగా ఉండాలి అని సీఎం స్టాలిన్ పాలనపై విజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “స్టాలిన్ అనే పేరు పెట్టుకుంటే సరిపోదు, గౌరవం సంపాదించాలి.. మీ కుటుంబం బాగుంటే సరిపోదు.. రాష్ట్రమంతా బాగుండాలి” అని సూచించారు. బీజేపీ (BJP) కక్ష సాధింపు రాజకీయం చేస్తోందని స్టాలిన్ అంటూనే తానూ అదే చేస్తున్నారన్నారు విజ‌య్‌.

తమిళనాడును తేలిగ్గా తీసుకోకండి..
ప్రధాని నరేంద్ర మోదీపై కూడా విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడును తేలిగ్గా తీసుకోవద్దు.. ఇది చరిత్ర సృష్టించిన రాష్ట్రం అని, డీలిమిటేషన్ (Delimitation) పేరుతో చేస్తున్న కుట్రలు అర్థమవుతున్నాయన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటూ తమిళనాడుకు అన్యాయం చేస్తున్నారని మండిప‌డ్డారు. విజయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment