ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు

నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారుడివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టి.. ఎదురుగా వస్తున్న టాటా సఫారి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా సఫారి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల ప్రకారం.. ప్రమాదానికి అధిక వేగమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న టాటా జైలో కారు, నార్సింగి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. అదే సమయంలో గచ్చిబౌలి నుంచి ఎయిర్ పోర్ట్ వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది.

కార్లంతా నుజ్జునుజ్జయ్యాయి. మృతిచెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ శివరాంపల్లి ప్రాంతానికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment