సినీ నటుడు, ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత వ్యాఖ్యల అభియోగాలపై అతనిపై 18కి పైగా కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, తాజాగా గుంటూరు కోర్టు ఇవాళ సీఐడీ కేసులో కూడా బెయిల్ మంజూరు చేసింది. దీంతో, రేపటికి గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.
జనసేన నేత ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 26న రాయచోటి పోలీసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్స్ నుంచి పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. ఆయనపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్లు తిరిగిన అనంతరం, చివరికి పోసానికి బెయిల్ లభించడం ఆయనకు పెద్ద రిలీఫ్‌గా మారింది.