పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ చేసిన పని భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ టీమ్, రోహిత్ శర్మ వాయిస్ ఓవర్‌ను ఉపయోగిస్తూ ఓ వీడియోను రూపొందించింది. కానీ, సమస్యేమిటంటే.. వీడియోలో PSL మస్కట్ ను లావుగా చూపించి, రోహిత్‌ను బాడీ షేమింగ్ చేసినట్లుగా ప్రదర్శించడం.
దీనిని చూసిన రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైరయ్యారు. “ఇదొక సిగ్గుమాలిన చర్య, ఒక లెజెండరీ ప్లేయర్‌ను ఇలా అవమానించటం అన్యాయమని” కామెంట్లు చేశారు. PSL టీమ్ నుంచి స్పందన రాకపోయినప్పటికీ, ఈ వివాదం వేడెక్కుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ పై ఇలా వ్యాఖ్యానించడం సరైంది కాదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై PSL నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.
Special presser called by Saeen at the Sultans Fort. 🎙️#HBLPSLX | #DECADEOFHBLPSL pic.twitter.com/csIrGdzHy1
— Multan Sultans (@MultanSultans) March 19, 2025