---Advertisement---

22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పాక్ నుంచి భారత్‌ చేరుకున్న మహిళ

22 ఏళ్ల నిరీక్షణకు తెర.. పాక్ నుంచి భారత్‌ చేరుకున్న మహిళ
---Advertisement---

22 సంవత్సరాల కష్టాలు, నరకయాతన అనంతరం, హమీదా బానో (Hamida Bano) అనే మహిళ పాకిస్తాన్ నుంచి భారత్‌కు తిరిగి చేరుకున్నారు. ఆమె 22 సంవత్సరాలు క్రితం పాకిస్తాన్‌లో చిక్కుకున్నప్పటినుంచి ఎటువంటి సహాయం లేకుండా జీవించాల్సి వచ్చింది. అస‌లు ఏం జ‌రిగిందంటే..

భర్త మరణం తరువాత, హమీదా బానో దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో పని చేసి తన కుటుంబానికి డ‌బ్బులు పంపించేవారు. 2002లో హమీదా బానో దుబాయ్‌లో వంటమనిషిగా ఉద్యోగం చేసేందుకు ఒక ముంబై ఏజెంట్‌ను సంప్రదించింది. అయితే ఆ ఏజెంట్ ఆమెను దుబాయ్‌కి బదులుగా పాకిస్తాన్‌కు పంపాడు. ఆమెను పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌ జిల్లాకు తీసుకెళ్లారు, అక్కడి నుండి ఆమె తిరిగి తన స్వదేశం భార‌త్ చేరుకోవ‌డానికి అనేక సార్లు ప్రయత్నించారు.

2022లో ఒక బాలుడు ద్వారా..
పాకిస్తాన్‌లో హమీదా బానో ఒక మదర్సా బయట కూర్చుని తినుబండారాలు అమ్ముతుండేది. ఆమె దగ్గరకి చాక్లెట్లు కొనుక్కునేందుకు వచ్చిన ఒక బాలుడు తన చదువు పూర్తయ్యాక ఒక టీవీ ఛానల్‌లో ఉద్యోగం సంపాదించాడు. ఒక రోజు అతను హమీదాను ఇంటర్యూ చేశాడు. ఇది అతను పనిచేస్తున్న టీవీలో టెలికాస్ట్‌ అయ్యింది. అది వైరల్‌గా మారింది. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులు, ప్రభుత్వ సహాయం ద్వారా పాకిస్తాన్ నుండి భారత్‌కు ఆమెను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

తిరిగివచ్చిన ఆత్మగౌరవం
భారత్‌కు తిరిగి చేరుకున్నహమీదా బానో తన కుటుంబాన్ని మళ్లీ కలవడం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. 22 సంవత్సరాల తర్వాత తన స్వదేశానికి తిరిగి రావడం ఆమెకు సంతోషాన్నిచ్చింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment