లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సుమారు గంటా 15 నిమిషాల పాటు కేంద్రమంత్రి బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మధ్య తరగతి ప్రజలే దేశ అభివృద్ధికి కీలకమని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించింది.
రెట్టింపు ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు ఇతర పన్నుల శ్లాబ్స్‌లోనూ మార్పులు చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చేవారం కొత్త ఇన్‌కం ట్యాక్స్ బిల్లు సభలో ప్రవేశపెడతామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫేస్‌లెస్ అసెన్మెంట్, రిటర్న్‌ల ప్రాసెసింగ్ వేగవంతం చేస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.
- బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే..
- ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడా్ న్యూస్. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపు.
- వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట
- 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
- బీమా రంగంలో ఎఫ్‌డీఐ 100 శాతానికి పెంపు
- గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
- కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు..