అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశం హీటెక్కింది. రష్యాతో యుద్ధం, ఖనిజ ఒప్పందాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వారించినా, జెలెన్‌స్కీ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలాంటి ఒప్పందాలకు సంతకం చేయకుండా, సమావేశం మధ్యలోనే జెలెన్‌స్కీ వెళ్లిపోయారు.
జెలెన్‌స్కీ క్లారిటీ
తాజాగా జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకోవాలన్నదే తన లక్ష్యమని, దానిని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం పలికితే, నిర్మాణాత్మక సంభాషణ కోసం మరోసారి భేటీకి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం చర్చలకు తాను ఎప్పుడూ సిద్ధమని జెలెన్‌స్కీ ప్రకటించారు.