తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై తక్షణం కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే, కోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు.
ఆఫీసర్లు బదిలీపై ఆగ్రహం
తొక్కిసలాట జరిగి కొన్ని గంటల తర్వాత అధికారులను బదిలీ చేయడంపై వైవీ సుబ్బారెడ్డికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం తాత్కాలిక చర్య అని, అసలు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం తప్పు అని ఆయన వ్యాఖ్యానించారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిపి, తిరిగి వారిపైనే విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంలోకి వచ్చి 7 నెలలు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చలేదని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. ఈసారి సంక్రాంతికి రాష్ట్రంలో పండుగ కళ కూడా లేదన్నారు.