ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా వ్యక్తిగత జీవితంలో సమస్యలు వారినీ మానసికంగా వేధిస్తాయి. టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వార్తల కారణంగా ఇదే పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. చాహల్, ధనశ్రీ విడాకుల వార్తలతోనే మద్యం మత్తులో ఉన్న ఓ వీడియో నెట్టింట హల్‌చల్ అవుతోంది. వీడియోలో చాహల్ పూర్తిగా తాగి పబ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఈ సంఘటన చాహల్ పరిస్థితిపై నెటిజన్లలో ఆందోళన కలిగించింది. అయితే, ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ వీడియో పాతదిగా తేలింది. 2024లో ఓ స్నేహితుడితో కలిసి వెళ్లిన పబ్ పార్టీకి సంబంధించినదని సమాచారం.
విడాకుల పుకార్లు నిజమేనా?
చాహల్, ధనశ్రీ తమ సోషల్ మీడియా అకౌంట్లలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, ఫొటోలు తొలగించడం వంటి చర్యలతో విడాకుల పుకార్లు బలం పొందాయి. ధనశ్రీకి భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో సంబంధం ఉందనే పుకార్లు కూడా చర్చనీయాంశమయ్యాయి.
చాహల్ కెరీర్‌పై ప్రభావం?
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ చాహల్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వ్యక్తిగత సమస్యలు అతని కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి.