ప్రభుత్వ సొమ్ముతో కరకట్ట ప్యాలెస్‌కు హంగులు – వైసీపీ తీవ్ర విమర్శలు

ప్రభుత్వ సొమ్ముతో కరకట్ట ప్యాలెస్‌కు హంగులు – వైసీపీ తీవ్ర విమర్శలు

అమరావతి (Amaravati)లోని సీఎం (CM) చంద్రబాబు (Chandrababu) నివాసం (Residence) కరకట్ట (Karakatta)  ప్యాలెస్‌ (Palace)కు ప్ర‌భుత్వ సొమ్ముతో హంగులు అంటూ వైసీపీ (YSRCP) తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఈ ట్వీట్‌ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇటీవల ఈ నివాసం మరమ్మతులు, సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1.21 కోట్లు కేటాయిస్తూ రెండు జీవోలు విడుదల చేసింది. అందులో రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా మంజూరు చేశారు. వీటిలో అత్యవసర మరమ్మతులకు రూ.50 లక్షలు, శానిటేషన్, నీటి సరఫరా పనులకు రూ.20 లక్షలు, వంటశాల సదుపాయాలకు రూ.16.50 లక్షలు, చెదల నివారణ చర్యలకు రూ.19.50 లక్షలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇప్పటికే గతంలో కరకట్ట ప్యాలెస్ సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.1.44 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు మరోసారి నిధులు విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాక, ఢిల్లీలో సీఎం నివాసానికి సౌకర్యాల అభివృద్ధి పేరుతో రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నివాసాలపై ప్రభుత్వ వ్యయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చర్యపై వైసీపీ తీవ్రంగా మండిపడింది. పార్టీ అధికారిక ట్వీట్‌లో, “విజనరీగా చెప్పుకునే బాబు కరకట్ట మీద అక్రమ కొంపలో ఉంటూ ప్రజల సొమ్ముతో హంగులు చేసుకుంటున్నాడు. సొమ్ము నీది కాకపోతే సముద్రంలో కూడా పందిరి వేస్తావు దొంగబాబు” అని వ్యాఖ్యానించింది. అలాగే, “రూ.931 కోట్ల ఆస్తులతో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల టాక్స్‌లతో తన కొంపకు సౌకర్యాలు పెంచుకుంటున్నాడు” అని విమర్శించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment