వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

వైసీపీలో విషాదం: సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

వైసీపీ (YSRCP)కి చెందిన సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి (Thopudurthi Bhaskar Reddy) అకాల మరణం చెందారు (Passed Away). శుక్రవారం మధ్యాహ్నం ఆయన తన పొలంలో పనులు చూసుకుంటుండగా, అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

భాస్కర్ రెడ్డి మృతి పట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన చిన్నాన్న మరణానికి సంతాపం తెలిపారు. అలాగే, అనంతపురం వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కూడా భాస్కర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. భాస్కర్ రెడ్డితో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment