సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? – వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

సూప‌ర్ సిక్స్ లేవు కానీ, విద్యుత్ చార్జీలు పెంచుతారా? - వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌శ్న‌

కూటమి ప్రభుత్వంపై రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన అమ‌లు చేయ‌డం మానేసి, విద్యుత్ చార్జీల పేరుతో ప్ర‌జ‌ల‌పై భారం మోపుతున్నార‌ని ఆరోపించారు. అన్న‌మ‌య్య జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆరు నెలల పాలనలోనే కూట‌మి ప్రభుత్వం మూడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అస‌లు విద్యుత్ చార్జీలు పెంచను అని వాగ్దానం చేసి.. ఆరు మాసాల్లోనే మూడుసార్లు పెంచ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

నిరసన కార్యక్రమాలకు పిలుపు
ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. “విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడు”పై వైసీపీ డిసెంబర్ 27న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తుంద‌ని తెలిపారు. స‌బ్‌స్టేషన్‌ల ఎదుట ధర్నాలు చేపట్టనుందని వివ‌రించారు.

ప్రజలు భాగస్వామ్యం
“విద్యుత్ వినియోగదారుల పక్షాన వైసీపీ న్యాయపోరాటం చేస్తోంది. నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి” అని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ప్రజలను పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్య ప్రజలకు వచ్చిన భారం ఎత్తివేయడం కోసం పార్టీ సంపూర్ణ నిబద్ధతతో కృషి చేస్తుందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment