మండలి చైర్మన్‌కు అవ‌మానం.. సీఎం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైసీపీ డిమాండ్‌

మండలి చైర్మన్‌కు అవ‌మానం.. సీఎం క్ష‌మాప‌ణ చెప్పాల‌ని వైసీపీ డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలి (Legislative Council)లో ఈరోజు తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి చోటుచేసుకుంది. శాస‌న‌ మండలి చైర్మన్ మోషేన్ రాజు (Moshen Raju) పట్ల కూట‌మి ప్రభుత్వం అవమానకర వైఖరి ప్రదర్శించిందని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు(YSRCP MLC) ఆందోళన చేపట్టారు. చైర్మ‌న్‌కు సీఎం (CM)చంద్ర‌బాబు (Chandrababu)  క్ష‌మాప‌ణ‌లు (Apologies) చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

మండ‌లిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. “నిన్న అసెంబ్లీలో భవనాలను ప్రారంభించారు. స్పీకర్, మంత్రులు హాజరయ్యారు. కానీ శాసన మండలి చైర్మన్‌కి ఆహ్వానం ఇవ్వలేదు. ఇదే కాకుండా తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా స్పీక‌ర్‌, డిప్యూటీ స్పీక‌ర్, మంత్రులు హాజ‌ర‌య్యారు. కానీ, మండ‌లి చైర్మన్‌కి ఆహ్వానం ఇవ్వలేదు. అది మీ పార్టీ సదస్సా?” అని వైసీపీ ఎమ్మెల్సీలు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు.

“మండలి చైర్మన్‌గా దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిని వరుసగా అవమానించడం దారుణం. గతంలో స్పోర్ట్స్ మీట్ సందర్భంలో కూడా చైర్మన్‌ను అవమానించారు. దీనిపై సీఎం, మంత్రి క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. చైర్మన్‌కు అవమానం జరిగిన విషయంపై శాసనసభా వ్యవహారాల మంత్రి సమాధానం చెప్పాలంటూ, లేకపోతే ముఖ్యమంత్రి స్వయంగా సభలో వివరణ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. దీంతో మండలిలో గందరగోళం నెలకొనగా, సభ వాయిదా పడింది.

మంత్రి అచ్చెన్న‌పై చైర్మ‌న్ ఆగ్ర‌హం
మండ‌లిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తిరుపతి సదస్సుకు చైర్మన్ రానని అధికారులు తెలిపారు అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేన్ రాజు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను రానని చెప్పానన్న వ్యాఖ్యలు అసత్యం. సభను తప్పుదోవ పట్టించకండి” అంటూ మోషేన్ రాజు తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో మండలి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చైర్మన్‌ను అవమానించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు పట్టుపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment