ప‌చ్చ‌కామెర్ల రోగం.. రంగుల‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ప‌చ్చ‌కామెర్ల రోగం.. రంగుల‌పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కూట‌మి ప్ర‌భుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు పేల్చారు. ఇటీవ‌ల కాలంలో కొన్నిచోట్ల‌ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, అన్నా క్యాంటీన్లు, కుట్టు మెషీన్ల‌కు, విద్యుత్ స్తంభాల‌కు, కూర్చునే బెంచీల‌కు, ఆఖ‌రికి టాయిలెట్ల‌కు కూడా ప‌సుపు రంగు వేసిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇది తెలుగు దేశం పార్టీ క‌ల‌ర్ కావ‌డంతో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని రంగుల విష‌యంలో నిందించిన తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి వ‌చ్చాక అదే పంథాను కొన‌సాగించ‌డంతో తీవ్ర దుమారం రేగింది.

తాజాగా డొక్కా సీత‌మ్మ మ‌ధ్యాహ్న భోజ‌నం ప‌థ‌కం కోసం వాహ‌నాల‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వం.. ఆ వెహికిల్స్‌కు కూడా ప‌సుపు రంగు వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. గ‌త ప్ర‌భుత్వాన్ని రంగుల పిచ్చి అని విమ‌ర్శించిన చంద్ర‌బాబు నాయుడు.. త‌న ప్ర‌భుత్వంలో టీడీపీ క‌ల‌ర్‌ను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడనే ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతుండ‌గా, వైసీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ సెటైర్లు వేశారు.

ఈ రంగు తెలుగుదేశం పార్టీ రంగు కాదా?
ఈ ఫొటోస్ కూటమి రాజకీయ నేతల ఫొటోస్ కాదా?
పచ్చకామెర్ల రోగం వచ్చి ఇలా రంగులేసారని అంటే బాగుంటుందా?
పోయేకాలం వచ్చి ఇలా ఫొటోస్ పెట్టుకున్నారంటే బాగుంటుందా?
మీరు మాపై ఇలా విమర్శలు చేస్తే పోరాటం అంటారు? మేము మిమ్మల్ని అంటే బూతులు అంటారు? అంతేగా!? అంటూ సీఎం చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ సెట‌ర్లు పేల్చుతూ ట్వీట్ చేయ‌గా, ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment