వైసీపీ నేత తండ్రి, 86 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు

వైసీపీ నేత తండ్రి, 86 ఏళ్ల వృద్ధుడిపై పోక్సో కేసు

నర్సాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కుటుంబంపై టీడీపీ కక్షసాధింపు రాజకీయ రంగంలో కలకలం రేపుతోంది. ఆయన 86 ఏళ్ల తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఈనెల 1వ తేదీన ధర్మవరంలో పింఛ‌న్ల పంపిణీ సందర్భంగా మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్లిన మహిళా సంరక్షణ కార్యదర్శి రాధిక, తనను 86 ఏళ్ల రామరాజు లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆగమేఘాలపై కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనపై స్పందించిన ముదునూరి మురళీకృష్ణంరాజు.. “ఇది పూర్తిగా టీడీపీ కుట్ర. ప్రత్తిపాడు ఎంపీడీవో కుమార్ ఈ వ్యవహారానికి మూలకర్త. నా తండ్రి 86 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ఆహారం పెట్టడం, దుస్తులు మార్చడం మేమే చేస్తాం. ఇలాంటి వయస్సులో ఆయనపై ఇలా మోసపూరితమైన కేసులు పెట్టడం అన్యాయం” అని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించి, ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ప్రత్తిపాడు వైసీపీ ఇన్‌ఛార్జ్ ముద్రగడ గిరిబాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ కాంతి సుధాకర్ మురళీకృష్ణంరాజును పరామర్శించి సంఘీభావం ప్రకటించారు. వైసీపీ వర్గాలు ఈ కేసును పూర్తిగా రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ టీడీపీపై మండిపడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment