‘ఇది రౌడీ రాజకీయం’.. పులివెందులలో దాడిపై వైసీపీ ఫైర్

‘ఇది రౌడీ రాజకీయం’.. పులివెందులలో దాడిపై వైసీపీ ఫైర్

పులివెందుల (Pulivendula)లో జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల (By-Elections) సందర్భంగా బీసీ నేత, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌ (Ramesh Yadav), వేల్పుల రాము (Velpula Ramu)పై తెలుగుదేశం పార్టీ (టీడీపీ)(TDP) శ్రేణులు దాడిని వైసీపీ(YSRCP) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి ఒక పథకం ప్రకారం జరిగిందని, పోలీసులకు ముందే దీని గురించి తెలుసని వైసీపీ ఆరోపించింది.

ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
ఈ ఘటనపై వైసీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (State Election Commissioner) నీలం సాహ్ని (Neelam Sahni) కి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మరియు వేల్పుల రామలింగారెడ్డిలపై జరిగిన దాడి గురించి వివరించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు.

మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు (Chandrababu) వయసు పెరిగే కొద్దీ బుద్ధి సన్నగిల్లుతోంది. పులివెందులకు టీడీపీ గూండాలను పంపి దాడులు చేయిస్తున్నారు. కత్తులు, రాళ్లతో దాడి చేసి రమేష్ యాదవ్‌ను చంపాలని చూశారు. పోలీసులకు తెలిసే ఈ దాడి జరిగింది. ఇది పథకం ప్రకారం జరిగింది. రౌడీయిజంతో ఎన్నిక గెలవాలని చూస్తున్నారు. రేపు జగన్ వచ్చాక పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి” అని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు (Malladi Vishnu) మాట్లాడుతూ, “ఏపీలో పోలీస్ వ్యవస్థ ఉందా? టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కావాలనే వందల మందిని బైండోవర్ చేస్తున్నారు” అని పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు.

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ (Devineni Avinash) మాట్లాడుతూ, “అరాచకం, దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నారు. పులివెందులలో టీడీపీ గూండాలకు సహకరించిన పోలీసులు, అధికారులను చట్టం ముందు నిలబెడతాం” అని స్పష్టం చేశారు.

ఈసీ కార్యాలయం ముందు ధర్నా
ఈ ఘటనను ఖండిస్తూ ఎన్నికల కమిషనర్ కార్యాలయం బయట వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment