వర్ల రామయ్యపై వైసీపీ ఫిర్యాదు.. కార‌ణం ఏంటంటే..

వర్ల రామయ్యపై వైసీపీ ఫిర్యాదు.. కార‌ణం ఏంటంటే..

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) సీనియ‌ర్ నాయకుడు వర్ల రామయ్య (Varla Ramaiah)పై తాడేపల్లి పోలీసు స్టేషన్‌ (Tadepalli Police Station)లో వైసీపీ (YSRCP) లీగల్ సెల్ (Legal Cell), ఎస్సీ సెల్ (SC Cell) ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం (Former CM) వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో అభిమానులు ప్ర‌ద‌ర్శించిన ర‌ప్పా.. ర‌ప్పా బ్యాన‌ర్‌పై ఆయ‌న చేసిన కామెంట్స్ ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు.

వైసీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు క‌న‌క‌రావు (Kommuru Kanakar Rao) మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటనలో ప్రదర్శించిన పోస్టర్లపై వర్ల రామ‌య్య తప్పుడు ప్రచారం చేశార‌ని ఆరోపించారు. విద్వేషాలు పెచ్చరిల్లేలా మాట్లాడార‌ని, హైద‌రాబాద్‌లో ప్ర‌ద‌ర్శించిన‌ బ్యాన‌ర్‌లో లేని వ్యాఖ్య‌ల‌ను మాట్లాడి, వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా దుష్ప్ర‌చారం చేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు పూర్తిగా కుట్ర‌పూరిత‌మైన వ్యాఖ్య‌ల‌ని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. వైఎస్ జగన్‌ ప్రతిష్టను దెబ్బతీయడానికి కూటమి నేతలు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. “పుష్ప సినిమాలో ఉన్న ఆ డైలాగ్‌ని సెన్సార్ కూడా కట్ చేయలేదు… ప్రజలకు అందుబాటులో ఉన్న డైలాగ్‌ను త‌ప్పుగా చిత్రీక‌రిస్తూ, జగన్‌పై ఆపాదిస్తూ, అసత్య ప్రచారం చేస్తున్నార‌ని తెలిపారు. వర్ల రామయ్య వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఆయనపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment