ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1500 మంది.. – జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

YS Jagan Mohan Reddy, YSRCP, Andhra Pradesh Politics, District Presidents meeting, Tadepalli, YSRCP office, Chandrababu Naidu, Failure CM, Booth Committees, Farmers issues, Andhra Pradesh, YSR Congress leadership, Political strategy, AP,

వైసీపీ జిల్లా అధ్యక్షులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సెంట్ర‌ల్ ఆఫీస్‌ (YSRCP Central Office, Tadepalli) లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్ జ‌గ‌న్ (Y.S. Jagan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీలో వ్యవస్థీకృత నిర్మాణం, నిర్మాణ క‌మిటీలు, జిల్లా అధ్య‌క్షుల‌కు (District Presidents) కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. జిల్లా అధ్య‌క్షుల స‌మావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. “చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) పూర్తిగా వైఫల్యం (Completely Failed) చెందింది. విద్య, వైద్యం, వ్యవసాయం అన్నిరంగాల్లోనూ విధ్వంసమే జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగమే (Red Book Constitution) రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీపై ఉంది” అని జిల్లా అధ్య‌క్షుల‌కు సూచించారు.

పార్టీ నిర్మాణంపై స్పష్టమైన లక్ష్యాలు..
వైఎస్ జగన్ పార్టీ నిర్మాణంపై మూడు విడతలలో స్పష్టమైన లక్ష్యాలను జిల్లా అధ్యక్షుల‌కు సూచించారు. మే నాటికి మండల కమిటీలు (Mandal Committees), జూన్-జూలైలో గ్రామ, మున్సిపల్ డివిజన్ కమిటీలు (Village & Municipal Division Committees), ఆగస్టు-అక్టోబరు నాటికి బూత్‌ కమిటీలు (Booth Committees) పూర్తిచేయాల‌ని సూచించారు. కమిటీలు పూర్తి చేయడం ద్వారా పార్టీకి సమర్థవంతమైన ఓటింగ్ యంత్రాంగం సిద్ధమవుతుందని, ప్రతి నియోజకవర్గంలో (Each Constituency) 1500 మంది, రాష్ట్రవ్యాప్తంగా (Across The State) 12వేలమంది నేతలు పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటారని చెప్పారు.

నాయకత్వ ప్రతిభకు ఇదే సమయం..
జిల్లా అధ్యక్షులు జిల్లాల్లో పార్టీకి ఓనర్‌షిప్ (Ownership) చూపించాల‌ని, ప్రజా సంబంధిత అంశాల్లో ఎవరైనా చెప్పేవరకు వేచి ఉండొద్ద‌ని, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల‌తో కలిసి ముందుకు కదలాలని సూచించారు. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా ఉండాల‌ని సూచించారు. జిల్లా అధ్య‌క్షుల పని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. భారీ లక్ష్యాలు ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ మెరిసిపోతాడని.. అందరూ ధోనీల్లా (Dhoni) తయారవ్వాలని సూచించారు. అప్పుడే జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను గెలవగలుగుతామ‌ని చెప్పారు. రైతులు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన జగన్, జిల్లాల్లో రైతుల పక్షాన పోరాటాలు నిర్వహించాలన్నారు. రైతులకు అండగా ఉండాల‌ని, వారి డిమాండ్లపై గళమెత్తండి అని జిల్లా అధ్య‌క్షుల‌కు వైఎస్ జ‌గ‌న్‌ సూచించారు.

ఏడాదికే వ్య‌తిరేక‌త‌..
స‌హ‌జంగా రెండు, మూడేళ్లు పూర్త‌యితే కానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటప‌డ‌ద‌ని, కానీ ఏడాదిలోపే కూట‌మి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంద‌న్నారు వైఎస్ జ‌గ‌న్‌. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేయాల సూచించారు. క‌మిటీలు పూర్తిచేసి కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు నిర్వ‌హించి బలంగా ముందుకుసాగాల‌న్నారు. మనమంతా రాజకీయ నాయకులం. ఈ జీవితాన్ని ప్రజల కోసం పెట్టాం. బాధ్యతలు తీసుకోవాలి, అధికారాన్ని సాధించాలి. ప్రతిపక్షంలోనే మా నాయకత్వాన్ని నిరూపించాలి” అంటూ వైఎస్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment