జనసేన..‘ఆంధ్ర మతసేన’ – పవన్‌పై షర్మిల ఫైర్

జనసేన..‘ఆంధ్ర మతసేన’ - పవన్‌పై షర్మిల ఫైర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ మేర‌కు వైఎస్ ష‌ర్మిల ట్విట్ట‌ర్‌లో చేసిన‌ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేసి.. ఇప్పుడు మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని వైఎస్ ష‌ర్మిల అన్నారు.

ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. జనసేన పార్టీని “ఆంధ్ర మతసేనా” పార్టీగా మార్చారని, జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమ‌న్నారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్రరాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా ప‌వ‌న్‌ వైఖరి ఉండటం విచారకరమ‌న్నారు.

పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్య‌తలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నామ‌న్నారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరమ‌న్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోని.. బీజేపీ మైకం నుంచి బయట పడాల‌ని వైఎస్ ష‌ర్మిల సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment