విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

విజ‌న్లు, వృద్ధిరేట్ల సాకుతో చంద్రబాబు కాల‌యాప‌న‌.. వైఎస్ షర్మిల ధ్వ‌జం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “సూపర్ సిక్స్” అనే ఆర్భాటంతో ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పటి పరిస్థితిని ప్రశ్నిస్తూ, ఆ హామీల అమలుకి అవసరమైన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎందుకు ఆలోచించలేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ సామెతను ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు త‌ల‌పిస్తోంద‌న్నారు. సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లుపై మ‌డ‌త‌పేచీ పెడుతూ.. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని, మనుషులు మన ఆస్తి అంటూ వింత వింత మాటలు చెప్తున్నారని, ఆడలేక మద్దెల దరువన్నట్లుంది చంద్ర‌బాబు వ్య‌వ‌హారం ఉంద‌న్నారు.

సూపర్ సిక్స్ హామీలు ఇప్పటి వరకు అమలుకాక‌పోవడంపై కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. “రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులలో ఉన్నప్పుడు, సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఏటా 2 లక్షల కోట్లు అవసరమయ్యే విషయం బాబుకు తెలియదా?” అని ఆమె ప్రశ్నించారు. “రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా, నిధుల కొరత ఎలా ఎదురవుతుందని చంద్రబాబుకు అర్ధం కావడం లేదా?” అని షర్మిల విమర్శించారు. అలాగే, “కేంద్రానికి మద్దతు ఇచ్చే పరిస్థితిలో, రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మోడీతో ఎందుకు జట్టు కట్టారు?” అని కూడా ప్రశ్నించారు.

విజన్లు లేదా కాలయాపన?
ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే, ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే, హామీలను తుంగలో తొక్కి, విజన్ల పేరుతో , వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప.. చంద్ర‌బాబు పనితనం శూన్యమ‌ని ష‌ర్మిల అన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదానే అని, నిధులు పారాలన్నా.. పరిశ్రమలు స్థాపన జరగాలన్నా.. ప్రజల ఆదాయం పెరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా.. హోదా ఒక్కటే శరణ్యమ‌న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment