ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ (YCP) తన పట్టు నిలుపుకుంది. మెజార్టీ (Majority) స్థానాలను గెలుచుకుంది. వైసీపీ విజయంపై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు. అధికార పార్టీల ప్రలోభాలను, బెదిరింపులను తట్టుకొని నిలబడిన పార్టీ నాయకత్వానికి నా హ్యాట్సాఫ్ (Hats off) అంటూ సంచలన ట్వీట్ చేశారు.
వైఎస్ జగన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో (Local Body By-Elections) కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా పోటీ చేసిందన్నారు. సీఎం చంద్రబాబు (Chandrababu) అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాధి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ వైసీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు బేఖాతర్ చేశారన్నారు. వైసీపీ (YCP) ఎంపీటీసీలు (MPTCs), జడ్పీటీసీలు (ZPTCs) ధైర్యంగా నిలబడి అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు.
విలువలకు (Values), విశ్వసనీయతకు (Credibility) పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నానని, క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం (Courage) పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన పార్టీ క్యాడర్ (Party Cadre) ను అభినందిస్తున్నానని, పార్టీకి వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ (Tweet) చేశారు.
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, @ncbn గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2025