టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనను (Governance) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రంగా విమర్శించారు. “కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదు, జగన్‌ను తిట్టడం హీరోయిజం కాదు. నిజమైన హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను (Promises) అమలు చేయడమన్నారు. దమ్ముంటే సూపర్ సిక్స్ (Super Six) హామీలను అమలు చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు జగన్. రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు నడుస్తున్నాయని, చంద్రబాబు పాలనలో విలువలు, విశ్వసనీయత లోపించాయని, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తాడేపల్లి (Tadepalli)లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YSRCP Central Office) మండపేట, మదనపల్లె మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగర పంచాయతీ, పెనుకొండ మండలం స్థానిక సంస్థల (Local Bodies) వైసీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.
ఈ పక్క నుంచి తంతే.. ఆ పక్కన పడతారు
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కోవిడ్ (COVID) కష్టకాలంలోనూ ప్రజలకు మేలు చేశామని గుర్తుచేశారు. “ఆదాయాలు తగ్గినప్పటికీ ప్రజలను ముఖ్యంగా భావించాం. మేనిఫెస్టో (Manifesto)లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం” అన్నారు. తమ హయాంలో బటన్ నొక్కి రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు అందించామని చెప్పారు. ఇన్ని చేసిన మనల్నే ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు.. ఏమీ చేయని చంద్రబాబును ప్రజలు ఈపక్కన తంతే.. ఆ పక్కన పడతాడన్నారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు విలువలతో నిలబడి, చంద్రబాబుకు గుణపాఠం చెప్పారని జగన్ ప్రశంసించారు. “మీ అందరి నిబద్ధతకు నా హ్యాట్సాఫ్” అని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశామని, కార్యకర్తలు గర్వంగా ప్రతి గడపకూ వెళ్లగలరని, చంద్రబాబు తన కార్యకర్తలకు అలా చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు.
వ్యవస్థలు నిర్వీర్యం..
చంద్రబాబు రాష్ట్రంలో ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఏడాది కాలంలో ఏకంగా 3లక్షల ఉద్యోగాలు పీకేశారని చెప్పారు. చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని ప్రభుత్వ ఉద్యోగులు తలపట్టుకునే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు నిర్వీర్యమైనాయని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు తిరోగమనంలో ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. “ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేక పేదలు అప్పుల పాలవుతున్నారు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర రావడం లేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తున్నారు” అని ఆరోపించారు.
కార్యకర్తలకు భరోసా
“జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. మీ ప్రతి కష్టం, అన్యాయం గమనిస్తున్నాను. అన్యాయం చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రిటైర్డ్ అయినా చట్టం ముందు నిలబెడతాం. వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు (Return Gifts) ఇస్తాం,” అని జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అన్యాయం చేయడానికి యూనిఫాం ఉందని భావించే వారు భయపడాలని, ఇలాంటి తప్పులకు శిక్ష తప్పదని తేల్చి చెప్పారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ప్రజల కోసం నిలబడాలని, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశం పార్టీ తమలో ఉత్సాహాన్ని నింపిందని వైసీపీ శ్రేణులు అంటున్నారు..
పేర్లు రాసిపెట్టుకోండి.. రిటర్న్ గిఫ్ట్‌లు ఇద్దాం
— Telugu Feed (@Telugufeedsite) May 28, 2025
ఈ సారి 2.Oలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తలకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాం. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్… pic.twitter.com/8bVyXlGwOi