‘పేర్లు రాసిపెట్టుకోండి.. వేరే లెవెల్‌ సినిమా చూపిద్దాం’ – వైఎస్ జ‌గ‌న్‌

YS Jagan Jagan 2.0 YSRCP Meeting TDP vs YSRCP Andhra Pradesh Politics Political Retaliation Jagan Speech Chandrababu Naidu YSRCP Workers AP Local Representatives Political Warnings India YSR Congress Party

స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశంలో (Local Bodies Public Representatives Meeting) వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ (Former CM Y. S. Jagan) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ 2.0 (Jagan 2.0)లో మొద‌టి ప్రాధాన్య‌త (First Priority) కార్య‌కర్త‌ల‌కే (Party Workers) ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింద‌ని, కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయని, గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే.. ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అని జ‌గ‌న్ ధీమా వ్య‌క్తం చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్న ఎవ్వ‌రినీ వదిలిపెట్టబోమని, అధికారంలోకి వచ్చాక వేరే లెవెల్ సినిమా (Next-Level Movie) చూపిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

తాడేప‌ల్లి (Tadepalli) లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో (YSRCP Central Office) అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (TDP Chief and CM N. Chandrababu Naidu)పై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కూట‌మి ప్ర‌భుత్వం ప్రజల్లో చులకన అయ్యింద‌ని, ఎన్నిక‌ల‌ హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలతో ప్రజలను బెదిరిస్తున్న పరిస్థితి చూస్తే, ఇది చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఉంద‌న్నారు. ప్రజలు ప్రశ్నించకూడదన్నదే లక్ష్యంగా ఆడుతున్న రాజకీయం ఇది అన్నారు జగన్.

పేర్లు రాసిపెట్టుకోండి..
కేవలం వైసీపీని ప్రేమించినందుకు, జ‌గ‌న్‌ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను తాను స్వ‌యంగా చూస్తున్నాన‌ని, అందుకే జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాన అని హామీ ఇచ్చారు వైఎస్ జ‌గ‌న్‌. అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర్త‌ల‌కు పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు. జ‌గ‌న్ 2.0లో మొట్ట‌మొద‌టి పీఠం వైసీపీ కార్య‌క‌ర్త‌కేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఎవ్వరినీ వదలం..
పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి అంటూ వైఎస్ జ‌గ‌న్ వైసీపీ క్యాడ‌ర్‌కు సూచించారు. అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పెట్టిన వారిని ఎవ్వ‌రినీ వదిలిపెట్టబోమ‌న్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గం.. వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందన్నారు. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్‌ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం, పట్టుకుని తీసుకొస్తాం.. వారికి సినిమా చూపిస్తాం.. అది వేరే లెవెల్ సినిమా అని జ‌గ‌న్ వార్నింగ్ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment