వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చి సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం విజయవాడ జైలుకు తరలించారు.
కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ నేతలను టార్గెట్ చేసి మరీ అక్రమ కేసులు బనాయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటీవల వంశీ అరెస్టుపై, దెందులూరులో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.