జ‌గ‌న్‌ను క‌లిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు

మాజీ సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన ఏపీ టూరిజం ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఉద్యోగుల ప్రతినిధి బృందం వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. రాష్ట్రంలో ఉన్న టూరిజం సంస్థకు చెందిన 22 హోటళ్లు, రిసార్ట్స్‌లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీంతో తమ ఉద్యోగ భద్రతే దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్‌సోర్సింగ్‌లో 488 మంది సేవలు అందిస్తున్నారని, అయితే ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన తాము రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతోందని వారు తెలిపారు. కుటుంబాల భవిష్యత్తు అంధకారంలో పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చిన ఉద్యోగుల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ.. టూరిజం కార్పొరేషన్ సిబ్బందికి అన్యాయం జరగకుండా చూడటానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగుల హక్కులు, భద్రత కోసం వైసీపీ అండగా ఉంటుందని జగన్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment