24 కేసులున్న చంద్రబాబును రోడ్డుపై కొడితే ధర్మమేనా..? – జగన్ తీవ్ర ఆగ్రహం

24 కేసులున్న చంద్రబాబును రోడ్డుపై కొడితే ధర్మమేనా..? - జగన్ తీవ్ర ఆగ్రహం

గుంటూరు జిల్లా తెనాలి (Tenali)లో పర్యటించిన వైసీపీ అధినేత (YSRCP Chief), మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) రాష్ట్రంలో పోలీసుల అరాచకాన్ని (Police Brutality) తీవ్రంగా ఖండించారు. ఇటీవల తెనాలిలో పోలీసులు దళిత యువకులను (Dalit Youths) రోడ్డుపై (Road) కొట్టిన ఘటనపై స్పందించిన ఆయన, ఈ దుర్మార్గ చర్యల వెనుక సీఎం చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu’s) ప్రమేయాన్ని తీవ్రంగా ఉంద‌ని, రెడ్ బుక్ రాజ్యాంగం (Red Book Constitution) అమ‌లు చేస్తూ రాష్ట్రంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నార‌ని ఆరోపించారు.

తెనాలి ఐతాన‌గ‌ర్‌ (Tenali Ithanagar)లో ముగ్గురు యువ‌కుల‌ను రోడ్డుపై కూర్చోబెట్టి వారి అరికాళ్ల‌పై పోలీసులు తీవ్రం కొట్టారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ దాడిని ముందే ఖండించిన జ‌గ‌న్‌.. ఇవాళ ఉద‌యం తెనాలి వెళ్లి ముగ్గురు యువ‌కుల కుటుంబాల‌ను (Families) ప‌రామ‌ర్శించారు. జాన్‌ విక్టర్ (John Victor) నివాసంలో బాధిత కుటుంబాల‌ను యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన జగన్ మాట్లాడుతూ, “విక్టర్‌పై ఘటన జరిగిన వెంటనే రౌడీషీట్ తెరిచారు. ఇది ఎంత అన్యాయమో మీరు చూడండి. పోలీసు వ్యవస్థ పూర్తిగా అదుపుతప్పింది. కేసులు తేల్చాల్సింది కోర్టులు. కానీ ఇప్పుడు తీర్పు చెప్పే బాధ్యతను పోలీసులు తీసుకున్నారు. ఇది ధర్మమా?” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌దువుకున్న‌ యువ‌కుల కుటుంబాల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దళితులపై దారుణం
రాకేష్ (Rakesh), జాన్ విక్టర్ (John Victor), బాబూలాల్ (క‌రీముల్లా) (Babulal / Kareemulla) అనే ముగ్గురు యువకులు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. రాకేష్ హైదరాబాద్‌లో జొమాటోలో పని చేస్తున్నాడు, మంగళగిరికి పాత కేసుకు హాజరుకి వచ్చాడు. విక్టర్ జూనియర్ అడ్వకేట్, ప్రాక్టీస్ చేస్తున్నారు. బాబూలాల్ మెకానిక్. ఈ ముగ్గురు ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండగా, సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుల్‌తో జరిగిన గొడవను ఆపేందుకు ప్రయత్నించారని తెలిపారు. కానీ అదే కారణంగా పోలీసులద్వారా వారిపై దాడి జరిగిందని జగన్ చెప్పారు. యువ‌కుల వ‌ద్ద‌కు సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్ ఎందుకు వ‌చ్చాడు.. అని వైఎస్ జ‌గ‌న్‌ ప్ర‌శ్నించారు.

ఏప్రిల్ 25న కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు మంగళగిరి నుంచి ఈ ముగ్గురు యువ‌కుల‌ను కొట్టుకుంటూ తెనాలికి తీసుకువచ్చారు. తర్వాతి రోజు, ఏప్రిల్ 26న ఐతానగర్ వద్ద రోడ్డుపైనే వారికి దాడి చేశారు. తెనాలి టూటౌన్ సీఐతోపాటు మరో సీఐ వచ్చి ప్రజలముందే తీవ్రంగా కొట్టారు. వారి కాళ్లకు బొబ్బలు వచ్చేలా దాడి జరిపారు. మరుసటి రోజు లింగారం సెంటర్‌లో మళ్లీ దాడి జరిపి మూడు రోజులు పోలీస్ కస్టడీలో ఉంచారు. 24 గంట‌ల్లో ఆ యువ‌కుల‌ను కోర్టులో ఎందుకు హాజ‌రుప‌ర‌చ‌లేదు..? అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

అక్ర‌మ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు..
వైఎస్ జగన్ చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారు. పోలీసులను బానిసల్లా వాడుతున్నారు. ముగ్గురు యువ‌కుల‌ను తీవ్రంగా కొట్ట‌డ‌మే కాకుండా న్యాయమూర్తికి నిజం చెప్పినా, ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంట్ షాక్ పెడతామన్న బెదిరింపులకు గురిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు. “ఇప్పుడు రాష్ట్రంలో అంబేద్క‌ర్‌ రాజ్యాంగం కాదు, చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లులో చేస్తున్నారు. ఇది పోలీసు వ్యవస్థ బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్న సంకేతం. చంద్రబాబు పాలనలో ప్రజలకు రక్షణ లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని వైఎస్ జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అలా అని బాబును త‌న్న‌డం ధ‌ర్మ‌మేనా..?
చంద్ర‌బాబు మీద 24 కేసులున్నాయని, ఆయ‌న్ను న‌డి రోడ్డు మీద‌కు తీసుకొచ్చి త‌న్న‌డం ధ‌ర్మ‌మేనా అని వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాత కేసులు ఉన్నాయ‌ని తీసుకొచ్చి కొట్ట‌డం పోలీసులు చేసిన ప‌నికి స‌మంజ‌సం కాదు. కేసులుంటే వాటిని తేల్చాల్సింది కోర్టులని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో వారిపై కేసులు ఉన్నాయి క‌దా అని పోలీసులు వారిని తీసుకొచ్చి న‌డి రోడ్డు మీద నిలబెట్టి కొట్టి, బాడీ షేమింగ్ చేస్తూ వారి కుటుంబ ప‌రువును తీయ‌డం భావ్య‌మేనా? రాకేష్ అనే యువకుడి కాలికి ఆప‌రేష‌న్ చేసి లోప‌ల‌ రాడ్డు వేశారు. ఈ విష‌యం పోలీసుల‌కు చెబుతున్నా వారు వినిపించుకోకుండా రాకేష్ కాలిపై బూటు కాళ్ల‌తో నిల‌బ‌డి తొక్కుతూ న‌డి రోడ్డు మీద దారుణంగా కొట్టడం ధ‌ర్మమేనా అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment