సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ (YS Jagan) అవమానించారనే దుష్ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఇటీవల పత్రికా ప్రకటన ద్వారా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ విషయాన్ని ఎన్నికల సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయ ప్రచార ఆయుధంగా మార్చుకున్నారని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగడంపై మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
“అసెంబ్లీ (Assembly)లో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ (Balakrishna) అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు? అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ధి లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. ఆయన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి” అని సంచలన కౌంటర్ ఇచ్చారు వైఎస్ జగన్.
అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు జగన్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అసెంబ్లీలో ఆయన ప్రవర్తన, భాషా శైలి పైన విమర్శలు వెల్లువెత్తుతుండగా, బాలకృష్ణ తాగి వచ్చారని జగన్ ఇచ్చిన కౌంటర్ వీడియో వైరల్ అవుతోంది.








