ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)కి ప్రాణహాని ఉన్నట్లు కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. రాష్ట్రంలో రెండు గ్యాంగ్‌లు దిగినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ (Central Intelligence) సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ (Gang)లలో ఒకటి హర్యానా నుంచి, మరొకటి కర్ణాటక (Karnataka) నుంచి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. అయితే వాటి మూలాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో జగన్‌కు జడ్ ప్లస్ భద్రత (Z+ Security)) ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
కేంద్ర నిఘా సంస్థలు జగన్‌ను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గత వారం నెల్లూరు (Nellore) పర్యటనకు(Visit) సంబంధించి ఢిల్లీ నుంచి ఓ ప్రముఖ వ్యక్తి జగన్‌కు ఫోన్ చేసి పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించినట్లుగా సమాచారం. అయితే ఎలాగూ హెలిప్యాడ్ సమస్య ఉండడంతో ఆ నెపంతో పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలిసింది. జగన్ ఇటీవల రైతులు, వైసీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు తరచూ జనంలోనే ఉంటున్నారు. ఈ పర్యటనలకు పెద్ద ఎత్తున జనం రావడం గమనార్హం. అయితే, జడ్ ప్లస్ భద్రత కలిగిన జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ తరచూ ఆరోపిస్తోంది. జగన్ భద్రతపై ఇటీవల గవర్నర్‌ను దృష్టికి తీసుకెళ్లారు. ఆ మెమోరండంను కేంద్రానికి కూడా పంపించారు.
మాజీ సీఎం కోరుకునే భద్రత తాము ఇవ్వలేమని ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనిత బహిరంగంగానే ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యేగా అవహేళనగా సంబోధించారని ఆరోపణలు ఉన్నాయి. జగన్ నివాసం వద్ద భద్రతా చర్యలు కూడా సరిగా లేవని, ఇటీవల ఆయన ఇంటిపై తాటి కాయలు వేయడం, గార్డెన్‌కు నిప్పు పెట్టడం వంటి సంఘటనలు జరిగినా, పోలీసులు ఫిర్యాదు అందే వరకు చర్యలు తీసుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ఇంటికి ఎవరు వెళ్తున్నారు.. ఎవరు వస్తున్నారనేది తెలుసుకోవడం ఏర్పాటు చేసిన కెమెరాలు తప్ప సర్వేలెన్స్ కెమెరాలు పనిచేయడం లేదని, ఆయన ఆనుకొని ఉన్న కట్ట కూడా ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. జగన్‌కు థ్రెట్ ఎవరి దగ్గర నుంచి వస్తోంది అనేది ప్రశ్న.
కేంద్ర నిఘా సంస్థలు జగన్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని మరో ముగ్గురు రాజకీయ నాయకులకు (తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా) ప్రాణహాని ఉందని హెచ్చరించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వారి పరిభాషలో జగన్ చుట్టూ 15 వేల అసాంఘిక శక్తులు ఉన్నాయని చెబుతుంటే.. కేంద్ర నిఘా సంస్థలు మాత్రం జగన్‌కు ప్రాణహాని ఉందని స్పష్టంగా అప్రమత్తం చేస్తున్నాయి. కేంద్ర నిఘా సంస్థలు జగన్‌కు స్పష్టమైన ప్రాణహాని ఉందని, ఆయన చుట్టూ రోప్ పార్టీలు, భద్రతా కార్డన్ లేకపోవడం వల్ల ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నట్లుగా సమాచారం. కర్ణాటక, హర్యానా నుంచి వచ్చిన రెండు గ్యాంగ్‌లను ఎవరు పంపారనే దానిపై కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు జగన్ ఎలిమినేషన్ దిశగా కుట్రలు చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, కేంద్ర నిఘా సంస్థల సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుందా..? మునుపటి లాగే ఎలాంటి భద్రత లేకపోయినా కార్యకర్తల సహకారంతో ప్రజల్లోనే కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం జగన్ భద్రతపై తీసుకునే చర్యలు, కేంద్ర నిఘా సంస్థల దర్యాప్తు ఫలితాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. వైసీపీ నాయకులు ఈ ఘటనను రాజకీయ కుట్రగా ఆరోపిస్తూ, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని జగన్ భద్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.
జగన్ గారికి ప్రాణ హాని నా 😳⁉️
— For A Reason (@far_in__x) July 7, 2025
2 గ్యాంగులు వచ్చాయా ⁉️
కేంద్రం హెచ్చరించిందా ⁉️
తాడేపల్లి ఇంటి దగ్గర నిఘా వ్యవస్థగా సరిగ్గాలేదా ⁉️ https://t.co/J10DfsL42H pic.twitter.com/NK9J17X4mk







