వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) యాక్టివిస్ట్ (Activist) కుంచల సవీంద్ర రెడ్డి (Kunchala Savindra Reddy) అక్రమ అరెస్ట్(Arrest)ను హైకోర్టు (High Court) సీబీఐ(CBI)కి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సవీంద్ర కేసు సీబీఐకి అప్పగించటంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్(YS Jagan) స్పందించారు. కోర్టు కీలక నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ మాజీ సీఎం ట్వీట్ చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.
‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్‌తో ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025








