టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ”సెప్టెంబ‌ర్ 15”

టీడీపీకి కౌంట‌రిచ్చిన‌ ''సెప్టెంబ‌ర్ 15''

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మెడిక‌ల్ కాలేజీల అంశంపై మాట‌ల యుద్ధం కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. మెడిక‌ల్ కాలేజీల‌ను మాజీ సీఎం ఒక్క‌టి కూడా క‌ట్ట‌లేద‌ని అధికార కూట‌మి ప్ర‌భుత్వం అంటుంటే.. ఇవిగో మేము పూర్తి చేసిన కాలేజీల తాలూకు వీడియోలు, ఫొటోలు అని ప్ర‌తిప‌క్ష వైసీపీ శ్రేణులు ఆధారాలు చూపిస్తున్నారు. ఈ మ‌ధ్య‌లో ప్రభుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టే తేదీ రానే వ‌చ్చింది. ఆ చ‌రిత్ర‌ను వైద్య ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ బ‌య‌ట‌పెట్టారు.

అదేంటంటే.. వైఎస్ జ‌గ‌న్ తాను అధికారంలో ఉండ‌గా అన్ని అనుమ‌తులు సాధించి, నిర్మించి, ఐదు మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించిన రోజు ఈరోజు. స‌రిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2023 సెప్టెంబ‌ర్ 15వ తేదీన ముఖ్య‌మంత్రి హోదాలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప‌ర్య‌టించి, ఐదు మెడిక‌ల్ కాలేజీను ప్రారంభించారు. విజయనగరం మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ప్రారంభించిన అనంత‌రం రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన మెడిక‌ల్ కాలేజీల‌ను వర్చువల్‌గా ప్రారంభించిన అనంత‌రం విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు.

మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభ‌మై నేటికి రెండేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ ప్రారంభోత్స‌వ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. జ‌గ‌న్ ఐదు మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇవి క‌నిపించ‌ని వారు క‌ళ్ల‌ద్దాలు కొనుక్కొని మ‌రీ చూడండి అంటూ వైసీపీ సానుభూతిప‌రులు సెటైరిక్‌గా కామెంట్లు పెడుతున్నారు.

అయితే ప్ర‌స్తుతం ఏపీలో మెడిక‌ల్ కాలేజీల అంశంపై అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య ర‌గ‌డ కొన‌సాగుతున్న త‌రుణంలో యాదృశ్చికంగా ఇవాళే మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఐదు మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించిన రోజ‌ని వైసీపీ గుర్తుచేసుకోవ‌డం అధికార పార్టీల నేత‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన‌ట్లు అయ్యిందంటున్నారు. క‌ళ్ల‌ముందు అత్యాధునికంగా నిర్మించిన భ‌వ‌నాలు, ప‌రిక‌రాలు క‌నిపిస్తున్నా.. ఇంకా పిల్ల‌ర్ల ద‌శ‌లోనే ఉన్నాయ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసే తెలుగుదేశం పార్టీ నేత‌లు.. ఇప్పుడేం స‌మాధానం చెబుతార‌ని వీడియో ప్రూఫ్‌తో నిల‌దీస్తున్నారు వైసీపీ శ్రేణులు. దీంతో అధికార పార్టీల నేత‌ల నోటి నుంచి మాట పెక‌ల‌ని ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు అయ్యింది.

ఐదు మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా పత్రికలో గత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన

Join WhatsApp

Join Now

Leave a Comment