చంద్రబాబు (Chandrababu) పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని, రాష్ట్రంలో న్యాయం, ధర్మం అనేవి ఎక్కడా కనిపించడంలేదని వైసీపీ (YSRCP) అధినేత, మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. తాడేపల్లి (Tadepalli)లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ (Legal Cell) ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి హాజరైన న్యాయవాదులతో రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు, వేధింపుల అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అడగకపోతే అమ్మ అయినా అన్నంపెట్టదు.. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు.. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే అన్యాయం జరిగిన వారికి న్యాయం కూడా దక్కదు అని అన్నారు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని వైఎస్ జగన్ ప్రశంసించారు. న్యాయం, ధర్మం కనపడని ఈ రోజుల్లో మీరు నిలబడతేనే ప్రజలకు న్యాయం దక్కుతుంది అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్ని విచ్ఛిన్నమైపోయాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎవరైనా తమకు వ్యతిరేకంగా ఉన్నారు అన్న అనుమానం వచ్చినా వెంటనే వారిని జైళ్లలో వేస్తున్నారు. తప్పుడు కేసులు, వాంగ్మూలాలు, సాక్ష్యాలతో రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుంటున్నారు” అని విమర్శించారు. ఈ నేపథ్యంలో లీగల్ సెల్‌కి మరింత బాధ్యత పెరిగిందని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్ 2.0లో న్యాయవాదులకు ప్రాధాన్యత
“వైసీపీ పాలనలో లా నేస్తం, సంక్షేమ నిధులు, ఇన్సూరెన్స్ సపోర్ట్ వంటి చర్యలతో న్యాయవాదులను ఆదుకున్నాం. ఇప్పుడు మీ సేవలను పార్టీ మరచిపోదు. మీరు పార్టీకి చేస్తున్న సేవలకు ప్రాధాన్యత ఇస్తాం” అని జగన్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసేవారి కోసం ప్రత్యేక డేటాబేస్ తయారవుతోందని, త్వరలో లాంచ్ కాబోయే యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరిగే అన్యాయాలపై ఫిర్యాదులు నమోదు చేయవచ్చని వివరించారు. “చట్టం తన పని తాను చేసుకుపోవాలి, అన్యాయంగా బాధిచేసిన వారిపై చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.








