శ్రీవారి దర్శనం కోసం వచ్చి తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి చేరుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పోలీసులు తీవ్ర ఆటంకం సృష్టించారు. తిరుపతి చేరుకున్న జగన్.. బాధితులను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తుండగా, పోలీసులు కనీసం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయలేదు. దీంతో పోలీసుల తీరుపై అసహనానికి గురైన జగన్.. వాహనం దిగి తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత స్థానిక నేత వాహనంలో ఆస్పత్రికి బయల్దేరి పద్మావతి ఆస్పత్రికి చేరుకున్నారు. పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట క్షతగాత్రులను జగన్ పరామర్శిస్తున్నారు. జగన్ వెంట వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్కే రోజా, భూమన అభినయ్‌రెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు.
పోలీసుల తీరుపై జగన్ అసహనం.. కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ..
