ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అవినీతి (Corruption) కేసులపై మాజీ సీఎం (Former CM) , వైసీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ (YS Jagan) స్పందించారు. కేసుల క్లోజ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు.. ఆ కండీషన్స్‌ను ఉల్లంఘిస్తున్నారని, ఆయన అవినీతిపై ఫిర్యాదులు చేసిన అధికారులను బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
“చంద్రబాబు… తానే దొంగ (Thief), తానే పోలీసు (Police). తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ బెయిల్ కండీషన్స్‌ను ఉల్లంఘించడం కాదా?ష వైఎస్ జగన్ ప్రశ్నించారు. అమరావతి (Amaravati), ఫైబర్‌నెట్ (Fibrenet), స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development), ప్రివిలేజ్ ఫీజు వంటి పలు అంశాలపై ఆయన ఆరోపణలు చేశారు.
అమరావతి రాజధాని ప్రాజెక్టులో చంద్రబాబు, అతని బినామీలు భారీ అవినీతికి పాల్పడ్డారని వైఎస్ జగన్ ఆరోపించారు. “అమరావతిలో చట్టపరంగా భూములు కొనరాదు, అమ్మరాదు. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేశారు. ఉచితంగా ఇస్తున్న పేరుతో కోట్ల విలువైన మోసాలు చేశారు” అని జగన్ గుర్తుచేశారు.
ఫైబర్‌నెట్ (Fibrenet) కాంట్రాక్టుల విషయంలో కూడా నేరాలున్నాయని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వ్యక్తికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారని జగన్ అన్నారు. “వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును మళ్లించారు” అని ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ. 370 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లాయని, ఆ ఫైళ్లలో చంద్రబాబు సంతకాలు ఉన్నాయని కూడా వెల్లడించారు.
అదనంగా, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజలు రద్దు చేయడం కూడా చంద్రబాబు చేసిన తప్పిదమని ఆయన పేర్కొన్నారు. “బాబు అండ్ కో గోబెల్స్‌ను మించిపోయారు” అంటూ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీటీడీ డబ్బుల్లో 10 శాతం మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదనే కఠిన నిబంధన ఉన్నప్పటికీ.. చంద్రబాబు 2014-19 వరకు అధికారంలో ఉన్న సమయంలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశార జగన్ చెప్పారు. తాము వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నామని, వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసిందని చెప్పారు. ఆ రూ.1300 కోట్ల డబ్బును ఎస్ బ్యాంక్ నుంచి వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.








